![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -711 లో.....రాజ్ దగ్గరికి యామిని వచ్చి వెడ్డింగ్ కార్డు చూపించగానే అతను షాక్ అవుతాడు. ఏంటి బావ అలా అయ్యావని యామిని అడుగుతుంది. ఏం లేదని రాజ్ అంటాడు. మరొకవైపు రాజ్ ని మాములు మనిషిని చెయ్యాలి అందుకు రాజ్ కి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చెయ్యాలని అపర్ణ అంటుంది. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదని కావ్య అంటుంది.
రాజ్ కి మీ మధ్య జరిగిన సంఘటన గుర్తు చెయ్యాలని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ ఫ్రెండ్ సందీప్ వెడ్డింగ్ అనివర్సరి పార్టీ ఉందట పిలిచాడు.. ఆ పార్టీకీ ఆయన్ని రప్పించి, నా ప్రయత్నం నేను చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత యామినితో పెళ్లి అంటే నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు.. కళావతిని కలిసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎందుకో యామిని పై కలగడం లేదు.. కళావతికి నాపై ఉన్న అభిప్రాయం కనుక్కోవాలని రాజ్ అనుకుంటాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. రాజ్ ని ఎలా పార్టీ కి పిలవాలని కావ్య ఆలోచిస్తుండగా రాజ్ ఫోన్ చెయ్యడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఫ్రెండ్ ఆనివర్సరీ పార్టీ ఉందని కావ్య చెప్పగానే నన్ను పిల్వండి నేను వస్తానని రాజ్ అంటాడు. సరే అని కావ్య పిలుస్తుంది. హమ్మయ్య ఇక కళావతి గారికి నాపై ఉన్న అభిప్రాయం తెలుసుకునే ఛాన్స్ దొరికిందని రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత రాజ్ బ్యాగ్ తో వస్తుంటే ఎక్కడికి అని యామిని అడుగుతుంది. ఫ్రెండ్ ఆనివర్సరీ పార్టీ ఉందని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా కావ్య ప్లాన్ అని యామినికి అర్థమవుతుంది. తను కావ్యకి ఫోన్ చేసి గొడవపడుతుంది. నీ ప్లాన్ ఫెయిల్ చేస్తాను.. రాజ్ ని ఆపుతానని ఛాలెంజ్ చేస్తుంది. తరువాయి భాగంలో పార్టీకి వెళ్తున్నానని రుద్రాణి రాహుల్ కి కావ్య చెప్పి వెళ్తుంది. రాజ్ , కావ్య ఇద్దరు రెసాట్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |